సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టార్ పవర్ 'కూలీ' సినిమా సాక్షిగా మరోసారి బయటపడింది. విపరీతమైన నెగిటివిటీ, ట్రోల్స్ వంటి వాటిని తట్టుకోవడంతో పాటు పూర్ రివ్యూలతో వందల కోట్లు వసూలు చేస్తోంది. వీకెండ్ వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

వీకెండ్ తర్వాత రోజు ఇండియాలో ఎన్ని కోట్లు?Coolie First Weekend Collection Worldwide: వరల్డ్ వైడ్ 'కూలీ' సినిమా ఫస్ట్ వీకెండ్ 400 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. నాలుగు రోజుల్లో తమ సినిమా 404 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని పేర్కొంది. ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.

Also Read: ఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్‌ బరిలో షాక్

Coolie Day 5 Collection India: ఇండియాలో మొదటి రోజు 'కూలీ' కలెక్షన్లు కుమ్మేశాయ్. మొదటి రోజు తమిళ సినిమా రికార్డులు తిరగ రాయడమే కాదు... మన దేశంలో 65 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తర్వాత నుంచి వరుసగా మూడు రోజులు 54, 39, 35 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే మండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయ్. మొదటి సోమవారం బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా రూ. 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్ నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంత? ఏమైంది?ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కూలీ వీకెండ్ కలెక్షన్లు 50 కోట్ల గ్రాస్ దాటింది. తెలుగులో 36 కోట్ల రూపాయల షేర్ (రూ. 53 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు సేఫ్ అవుతారా? లేదా? అనేది చూడాలి. కానీ వరల్డ్ వైడ్ సేఫ్ అయ్యే ఛాన్సులు తక్కువ. తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడానికి మరొక 10 కోట్ల షేర్ రాబట్టాలి. వరల్డ్ వైడ్ అయితే రూ. మరో 111 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతానికి ప్రొడక్షన్ హౌస్ నాలుగు రోజుల్లో 404 కోట్ల గ్రాస్ అని అనౌన్స్ చేసింది. కానీ, అది 380 కోట్లకు అటు ఇటుగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ షేర్ రూ. 195 కోట్లు.

Also Read'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?

సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రచితా రామ్, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రత్యేక గీతం చేసింది.