War 2 Box Office Collection Worldwide Day 5: వీకెండ్ వరకు ఒక లెక్క, వీకెండ్ తర్వాత మరో లెక్క అన్నట్టు తయ్యారయ్యింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన 'వార్ 2' పరిస్థితి. సాధారణంగా ఏ సినిమాకు అయినా సరే వీకెండ్ తర్వాత వచ్చే జనాల సంఖ్య తగ్గుతుంది. అయితే 'వార్ 2' టికెట్ సేల్స్ దారుణంగా పడ్డాయి. ఐదో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
ఇండియాలో పది కోట్ల కంటే తక్కువ!War 2 Day 5 Collection India: ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలో 'వార్ 2'కు మొదటి రెండు రోజులు 50 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు రోజులు 30 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ, ఐదో రోజు పది కోట్ల కంటే కిందకు సినిమా పడింది.
ఇండియాలో సోమవారం 'వార్ 2'కు వచ్చిన వసూళ్లు రూ. 8.50 కోట్లు అని టాక్. ఈ సినిమా వీకెండ్ వరకు 174.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ రూ. 183.25 కోట్లు. ఇండియాలో 200 కోట్ల నెట్ కలెక్షన్ మార్క్ రీచ్ అవ్వాలంటే ఎలా లేదన్నా మరో మూడు నాలుగు రోజులు కావాలి.
వీకెండ్ వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?War 2 First Weekend Collection Worldwide: వీకెండ్ వరకు వరల్డ్ వైడ్ 'వార్ 2' ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పై థ్రిల్లర్ రూ. 57 కోట్ల గ్రాస్ రాబట్టింది. షేర్ విషయానికి వస్తే... 39.75 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 'వార్ 2'కు వచ్చిన వసూళ్లు 263 కోట్ల రూపాయల గ్రాస్. అందులో షేర్ 140 కోట్లు మాత్రమే. బాక్స్ ఆఫీస్ బరిలో 'వార్ 2' క్లీన్ హిట్ అనిపించుకోవాలని అంటే మరో రూ. 166 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి.
Also Read: 'కూలీ'లో నాగార్జునకు డూప్... ఇతడి పేరేంటో తెలుసా?
'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం మీద YRF SPY Universeలో భాగంగా ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. ఇప్పటి వరకు ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన సినిమాల్లో దారుణమైన రిజల్ట్ అందుకున్న సినిమాగా 'వార్ 2' నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ టాక్.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?