'కూలీ'లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటనకు మంచి పేరు వస్తోంది. విలన్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆయన్ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సరిగ్గా వాడుకోలేదని మన తెలుగు ఆడియన్స్ కొందరు ఫీల్ అయ్యారు. అన్నట్టు ఈ సినిమాలో ఆయనకు ఒక డూప్ కూడా నటించారు. అతను ఎవరో తెలుసా?

'కూలీ' సినిమాలో నాగార్జున డూప్ ఎవరంటే?'కూలీ'లో నాగార్జున వైట్ సూట్ లుక్ వైరల్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక... ఆ విజువల్స్‌లో నాగార్జున ఇచ్చిన విలనీ ఎక్స్‌ప్రెషన్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ సైతం సర్‌ప్రైజ్ అయ్యారు. అక్కడ మాత్రమే కాదు... 'కూలీ'లో నాగ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సులు సైతం చేశారు. అందులో ఆయనకు ఒక డూప్ చేశారు. 

'కూలీ'లో నాగ్ డూప్ కింద చేసిన అబ్బాయి పేరు ఇంద్రజిత్ అజు. అతనిది చెన్నై. వృత్తిరిత్యా అతనొక లాయర్. మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. తమిళంలో సీరియల్స్, కొన్ని యూట్యూబ్ సిరీస్‌లు చేసినట్టు తెలిసింది. 'కూలీ' విడుదల అయ్యాక తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక వీడియో షేర్ చేశారు. నాగార్జునకు డూప్ కింద చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని, తనకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జునకు థాంక్స్ అని పేర్కొన్నారు.

Also Readకూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!

హీరోలకు డూప్స్ ఉండటం కొత్త విషయం ఏమీ కాదు. ఇటీవల ప్రతి సినిమాకు స్టార్ హీరోల బదులు డూప్స్ చేస్తున్నారు. యాక్షన్ స్టంట్స్ చేసే విషయంలో దర్శకులు రిస్క్ తీసుకోవడం లేదు. హీరోల ఫిజిక్ మ్యాచ్ చేసే మోడల్స్ ను తీసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరికీ డూప్స్ ఉన్నారు. అయితే ఇటీవల విజువల్ ఎఫెక్ట్స్ సరిగా చేయడంపోవడం వల్ల ట్రోల్ అయ్యారు. కానీ, నాగార్జునకు డూప్ చేసిన విషయం ఇంద్రజిత్ చెప్పే వరకు తెలియలేదు. 

నాగార్జున విలనిజాన్ని క్లాప్స్... ఫ్యాన్స్ హ్యాపీ!'కూలీ' సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. అయితే నాగార్జున నటనకు మంచి అప్లాజ్ లభిస్తోంది. ఆయన్ను దర్శకుడు సరిగా వాడుకోలేదని కామెంట్స్ వినబడుతున్నాయి. సినిమాకు సైతం ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. తమిళంలో తప్ప మిగతా భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అక్కడ నుంచి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లకు సైతం గండి పడుతోంది.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?