Rajinikanth Coolie Two Days Collection Movie: కోలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాసిన సినిమాగా 'కూలీ' చరిత్రకు ఎక్కింది. ఓపెనింగ్ డే 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి తమిళ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. ఇండియాలో 'కూలీ' వసూళ్లు తగ్గాయి.
మొదటి రోజు కంటే 12 కోట్లు తక్కువ!Coolie Worldwide Collection Day 2: 'కూలీ' సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బరిలో 151 కోట్లు వచ్చాయి. అందులో ఇండియా వాటా 65 కోట్ల నెట్ కలెక్షన్. గ్రాస్ విషయానికి వస్తే ఇండియాలో 75 కోట్లు వచ్చాయి. అయితే... ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర రెండో రోజు ఆశించిన ఆదరణ కనిపించలేదు.
Also Read: కూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!
ఇండియన్ మార్కెట్టులో మొదటి రోజు 65 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టిన 'కూలీ'... రెండో రోజు 12 కోట్లు తక్కువగా 53 కోట్ల నెట్ వసూళ్లతో సరిపెట్టుకుంది. మూవీకి వచ్చిన మిక్స్డ్ టాక్, నెగిటివ్ రివ్యూలు ఇంపాక్ట్ చూపించాయని ట్రేడ్ వర్గాల అంచనా.
రెండు వందల కోట్ల క్లబ్బులో రజనీ 'కూలీ'Rajinikanth Coolie enters 200 Crore Club: రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా 151 కోట్లు కలెక్ట్ చేసిన 'కూలీ'... రెండో రోజు అయినటువంటి ఆగస్టు 15న కేవలం ఇండియాలో వచ్చిన కలెక్షన్లతో 200 కోట్ల క్లబ్బులో చేరింది. ఓవర్సీస్ నుంచి వచ్చే కలెక్షన్స్ బట్టి 250 కోట్ల క్లబ్బులో చేరుతుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'కూలీ'లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ హీరోయిన్ రచితా రామ్, కమల్ హాసన్ కుమార్తె - పాన్ ఇండియా హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్ యాక్ట్ చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.