Geetha Govindam 7 Years: యంగ్ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్‌ క్రిష్‌ రష్మికా మందన్నా మధ్య ఏదో సమ్‌థింగ్‌ సమ్‌థింగగ్ ఉందని టాలీవుడ్‌ టు బాలీవుడు కోడై కూస్తోంది. ఇలాంటి విషయాలపై ఎప్పుడూ స్పందించని ఈ జంట మాత్రం తమకు నచ్చినట్టు తిరిగేస్తున్నారు. జంటగా తిరుగుతూ మీడియా కంట కూడా పడుతున్నారు. విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మీ ఊహకే వదిలేస్తున్నాం అన్నట్టు లీకులు ఇస్తుంటారు. ఇలాంటిటైంలో విజయ్‌తో రొమాంటిక్ ఫోజులు ఇస్తూ దిగిన ఫొటోలను ఆగస్టు 15 రోజున రష్మికా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సందర్భం వేరే అయినప్పటికీ నెటిజన్లు మాత్రం ప్రేమ ప్రయాణంలో మరో వేశారని కామెంట్ చేస్తున్నారు.  

విజయ్ తో ఉన్న ఫొటోలు షేర్ చేసిన రష్మికా 

రష్మికా మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుంచి విజయ్ దేవరకొండతో ఉన్న పలు చిత్రాలను షేర్ చేసింది. అందులో చాలా రకాలు ఫొటోలు ఉన్నాయి. కానీ ఓ రొమాంటిక్ ఫొటోన మాత్రం విజిబుల్‌గా ఉండేలా చేశారు. వాస్తవానికి ఈ ఫొటోలు వీరిద్దరు కలిసి నటించిన 'గీత గోవిందం' చిత్రానికి సంబంధించినవి. ఈ సినిమా విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేషనల్‌ క్రష్‌ నాటి ఫొటోలు షేర్ చేసింది. చాలా భావోద్వేగానికి గురైంది. ఆమె సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

 

ఏడు సంవత్సరాల 'గీత గోవిందం' 

ఈ ఫొటోలను పంచుకుంటూ, రష్మిక పెట్టిన పోస్ట్‌ కూడా ఆసక్తిగా ఉంది. '7 సంవత్సరాల క్రితం నాటి ఈ చిత్రాలన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయని నేను నమ్మలేకపోతున్నాను. 'గీత గోవిందం' ఎల్లప్పుడూ అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా ఉంటుంది. ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నేను గుర్తుంచుకుంటున్నాను. మనమందరం కలిసి చాలా కాలం అయ్యింది. కానీ వారు మంచిగా రాణిస్తున్నారని ఆశిస్తున్నాను. 7 సంవత్సరాలు అయ్యిందని నేను నమ్మలేకపోతున్నాను, ఏడేళ్ల గీతా గోవిందానికి శుభాకాంక్షలు' అని రాసుకొచ్చింది. 

వినియోగదారులు అలాంటి వ్యాఖ్యలు చేశారు

నటి షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్-రష్మిక లవ్‌ కెమిస్ట్రీ మొదటి ఫోటోలో కనిపించింది అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఈ జంట తమ మధ్య ఉన్న బంధాన్ని కన్ఫామ్‌ చేశారని మరొకరు రాసుకొచ్చారు. 'నేను ఒక నిమిషం షాక్ అయ్యాను..' అని ఇంకో యూజర్‌ కామెంట్ పెట్టాడు. మరొకరు 'మీ పెళ్లి కోసం వేచి చూస్తున్నాను..' అని అన్నారు. ఇది కాకుండా, చాలా మంది ఈ పోస్ట్‌పై అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తామంతా గీతాగోవిందం ఫ్యాన్స్ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. దీంతో ఈ పోస్టు వైరల్‌ అయ్యింది.