విజయ్ సేతుపతి తనయుడు సూర్య కథానాయకుడిగా నటించిన 'ఫోనిక్స్' సినిమా తెలుసుగా! అందులో నటించిన యంగ్ హీరోయిన్ వర్ష విశ్వనాథ్ గుర్తు ఉందా? ఓ తెలుగు సినిమా చేసింది ఆ అమ్మాయి. ఆ మూవీ పేరు 'మటన్ సూప్'. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు.
మటన్ సూప్... ఇదొక రియల్ క్రైమ్ కథ!'మటన్ సూప్'లో వర్ష విశ్వనాథ్ జంటగా రమణ్ నటించారు. ఈ సినిమాకు విట్‌నెస్ ది రియల్ క్రైమ్ అనేది ఉపశీర్షిక. రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) సంస్థలపై రామకృష్ణ వట్టికూటి సమర్పణలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్నారు.
Also Read: కూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?
Mutton Soup Movie Cast And Crew: రమణ్, వర్ష విశ్వనాథ్ జంటగా నటిస్తున్న 'మటన్ సూప్' సినిమాలో 'జెమినీ' సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: లోకేష్ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పర్వతనేని రాంబాబు, ఛాయాగ్రహణం: భరద్వాజ్ - ఫణింద్ర, సంగీతం: వెంకీ వీణ, నిర్మాణ సంస్థలు: అలుక్కా స్టూడియోస్ - శ్రీ వారాహి ఆర్ట్స్ - భవిష్య విహార్ చిత్రాలు (BVC), సమర్పణ: రామకృష్ణ వట్టికూటి, నిర్మాతలు: మల్లిఖార్జున ఎలికా (గోపాల్) - అరుణ్ చంద్ర వట్టికూటి - రామకృష్ణ సనపల, దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.