సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ప్రారంభం అయింది. ఈ ఘట్టానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ డ్యాన్స్ చేశారు. మొండా మార్కెట్ ఆదయ్య నగర్ కమాన్ నుండి ఫలహారం బండి ప్రారంభం అయింది. పోతురాజుల నృత్యాలు, కళాకారుల వివిధ వేశధారణలు, పాటలతో స్థానిక ఆదయ్య నగర్ పరిసరాలు మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.
నేడు (జూలై 10) ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు ఎలాంటి ఆటంకం కలగక పోవడం ఆనందంగా ఉందని మంత్రి తలసాని అన్నారు. భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగిందని అమ్మవారం చెప్పడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన బోనాలకు అన్ని శాఖల వారు సహకరించాయని తెలిపారు.
మహంకాళి బోనాల్లో ప్రధాన ఘట్టం అయిన రంగం కార్యక్రమం ఘనంగా జరిగిందని అన్నారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చదివి వినిపించారని.. ఈ కార్యక్రమంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు. రాత్రి అంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు దర్శనం అమ్మవారిని దర్శనం చేసుకున్నారని చెప్పారు.
ఒకప్పుడు రాజకీయ నేతలు దర్శనం తరువాత వర్షాలు పడాలి అని కోరుకునే వారని చెప్పారు. 2014 తరువాత రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. బోనాలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు చెప్పారు.