Student Accommodation: పదో తరగతి వరకు ఎక్కడ చదివినప్పటికీ.. పై స్థాయి చదువుల కోసం చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ లాంటి కోర్సులు చేయడానికి ఉన్న ఊరి నుంచి నగరాల బాట పడతారు. అయితే అలా ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు హాస్టల్స్ లో, రూముల్లో ఉంటూ రోజూ అక్కడి నుంచి కాలేజీలకు వెళ్లి వస్తుంటారు. ఇన్ని రోజులు ఇంట్లో తల్లిదండ్రుల చెంత చాలా సౌకర్యవంతంగా ఉంటూ చదువుకున్న విద్యార్థులు.. ఇప్పుడు ఒక్కసారిగా కొత్త ఊరు, కొత్త  కాలేజీ, కొత్త ప్రాంతంలో త్వరగా ఇమిడిపోలేరు. హాస్టల్ కూడా ఇల్లు ఉన్నంత సౌకర్యవంతంగా ఏమీ ఉండదు. ఉన్నత చదువులపై వీటి ప్రభావం పడకుండా ఉండాలంటే వసతి గృహాలు, గదులు ఎంచుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. హాస్టల్స్, రూమ్స్ ఎంచుకునేటప్పుడు చూడాల్సిన 10 విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. లొకేషన్


హాస్టల్ లేదా రూము ఎక్కడ అనేది చాలా ముఖ్యమైన అంశం.  మీరు వెళ్లే కాలేజీ, వర్సిటీ, ఇన్‌స్టిట్యూషన్ ఎక్కడ ఉంది.. అక్కడికి వసతి గృహానికి ఎంత దూరం ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటుందా అనేది చాలా ముఖ్యం. కిరాణ దుకాణాలు, బస్ స్టాప్ లకు దగ్గరగా ఉండే హాస్టల్స్, రూముల్లో ఉండటం మంచిది.


2. కాస్ట్


నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలా ముఖ్యం. హాస్టల్ అయినా, రూము అయినా నెలవారి ఖర్చులు ఎంత అవుతున్నాయో బేరీజు వేసుకోవాలి. హాస్టల్ లో ఉంటే ఎంత ఖర్చవుతుంది, ఫుడ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఫ్రెండ్స్ తో రూముల్లో ఉంటే అయ్యే ఖర్చెంత, ఎలాంటి పనులు చేయాలి, ఫుడ్ ఎలా ఉంటుందో కంపేర్ చేసుకుని హాస్టల్ లేదా రూము ఎంచుకోవాలి.


3. గది పరిమాణం


గది విశాలంగా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇరుకిరుకు గదిలో ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండలేము. మీ అవసరాలకు తగినంత స్థలం ఉన్న హాస్టల్ రూములు, షేరింగ్ రూములనే ఎంచుకోవాలి.


4. సౌకర్యాలు


వసతి సౌకర్యంగా ఉంటేనే మిగతా విషయాలపై ముఖ్యంగా చదువుపై దృష్టి సారించగలం. జీవన నాణ్యత కూడా బాగుంటుంది. సౌకర్యాలు లేని చోట ఉంటే.. రోజూ వారి పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అలాగే ఉండే రూముకు దగ్గర్లో పార్కులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఉండేలా చూసుకోవడం కూడా మంచిది.


Also Read: Good Study Habits: చదివింది ఒంటబట్టాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి


5. సేఫ్టీ, సెక్యూరిటీ


మనం ఉండే చోట సేఫ్టీ బాగుండేలా చూసుకోవాలి. భద్రతా పరమైన అంశాలు బాగుంటే బిందాస్ గా ఉండొచ్చు. సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలు, తలుపులకు తాళాలు, మంచి రూమ్మేట్ ఉండాలి.


6. లీజు నిబంధనలు


గది అద్దెకు తీసుకుంటున్నా.. ఏదైనా ఫ్లాట్ ను లీజుకు తీసుకున్నా ఆయా నిబంధనలు సరళంగా ఉండేలా చూసుకోవాలి. అద్దె పెంపు, లీజు ఎంత కాలం, అడ్వాన్స్ అమౌంట్ గురించి అన్నీ సక్రమంగా ఉండాలి.


7. ప్రైవసీ


ప్రతి వ్యక్తికి ప్రైవసీ ముఖ్యం. హాస్టల్స్ లో ఉంటున్నా, షేరింగ్ రూముల్లో ఉంటున్నా మీకు ఎంత ప్రైవసీ లభిస్తుందో తెలుసుకోవాలి. మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఇతరులు వాడకుండా సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి.


8. మెయింటెనెన్స్


హాస్టల్ అయినా, రూము అయినా ఏదైనా సమస్య వచ్చినా, ఎలక్ట్రిసిటీ రిపేర్లు వచ్చినా, ట్యాప్ పని చేయకపోయినా మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. అది సరిగ్గా ఉంటేనే ఆ వసతిలో అడుగుపెట్టండి.


9. సోషల్ ఎన్విరాన్‌మెంట్


అన్ని రకాల సంస్కృతుల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల ఆయా వ్యక్తులతో ఎలా ఉండాలో తెలియడంతో పాటు సోషల్ సర్కిల్ కూడా పెరుగుతుంది.


10. రివ్యూలు


హాస్టల్ ఎంచుకున్నట్లయితే అంతకుముందు అందులో ఉన్న వారితో మాట్లాడటం వల్ల సమస్యలు, సౌకర్యాలు రెండింటి గురించి తెలుస్తుంది. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial