ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పర్యటన ముగిసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని విమర్శించారు. తాజాగా తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (జూలై 4) మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పూర్తిగా చప్పగా సాగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు.


నిన్నటి ప్రసంగంలో ప్రధాని మోదీ తెలంగాణలో ఆలయాల గురించి మాట్లాడారని, అసలు గుడుల అభివృద్ధి కోసం కేంద్రం తరపున ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని, అలాంటి లక్ష కోట్ల విలువైన బియ్యం ఎలా కొన్నారని చెప్తారని ప్రశ్నించారు. 


Also Read: Why Pavan boycott : మోదీ వచ్చినా జనసేనాని ఎందుకెళ్లలేదు ? బీజేపీతో అంత గ్యాప్ పెరిగిందా ?


హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారు
తెలంగాణలో సింగిల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ డబుల్ ఇంజిన్ అయితే, ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం జరుగుతోందని నిలదీశారు. ఇక్కడ ఉన్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి ఏ మాత్రం ఉందని ప్రశ్నించారు. మోదీ కేవలం హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో అమిత్ షా తెలంగాణలోని నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారని, వారు ఈ రెండు రోజులు తెలంగాణ నీళ్లే తాగారని గుర్తు చేశారు.


‘‘నిన్న బీజేపీ సభకు మా బల్కంపేట టెంపుల్‌కు వచ్చిన మంది కూడా రాలేదు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోదీ ఒక్క సమాధానం ఇవ్వలేదు. టెక్స్‌టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. మూడేళ్లనుంచి ఇక్కడే ఉన్న కిషన్‌‌ రెడ్డి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చారు? అభివృద్ధి చేశారా? ఇక్కడ శాంతి భద్రతలు లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అని అన్నారు. చిల్లర రాజకీయాలు మేం చేయం. ప్రధాని మోదీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు’’ అని మంత్రి తలసాని మాట్లాడారు.


Also Read: Modi Helicopter Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే


Also Read: Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు