హైదరాబాద్‌కు ఐటీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు రావడానికి మైక్రోసాఫ్ట్ అమెరికా బయట తొలి డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కారణం. అప్పట్నుంచి అంచెలంచెలుగా మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌లో విస్తరిస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో మరో రూ. పదిహేను వేల కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం చేసుకుంది. తెలంగాణలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. 


Also Read: కన్నా లక్ష్మీ నారాయణకి కోర్టులో చుక్కెదురు, కోడలు వేసిన పిటిషన్ వల్లే.. ఆమెకు కోటి చెల్లించాల్సిందేనని తీర్పు


 మేరకు మైక్రోసాఫ్ట్‌, తెలంగాణ సర్కార్‌ల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కాగా హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం కానుంది. కొత్తగా నెలకొల్పబోయే డేటా సెంటర్‌ కోసం రూ.15 వేల కోట్ల రూపాయలను మైక్రోసాఫ్ట్‌ కేటాయించనున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఖరారైన తర్వాత తెలంగాణ సర్కార్‌, మైక్రోసాఫ్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన


నిజానికి గత జూలైలోనే మైక్రోసాఫ్ట్ తమ హైదరాబాద్ డేటా కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటిస్తుందని అనుకున్నారు. అప్పటికే తెలంగాణ సర్కార్ భూమిని .. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చూపించింది. ఆ భూమి,  ప్రభుత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిన సౌకర్యాల పట్ల మైక్రోసాఫ్ట్ సంతృప్తి చెందింది. కానీ కరోనా పరిస్థితులు.. వివిధ కారణాల ఆలస్యం అవుతోంది. మరో వెల రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ ఏ విషయమైనా పూర్తి స్థాయిలో.. ఒప్పందాలు పూర్తయిన తర్వాతనే వెల్లడిస్తుంది. మైక్రోసాఫ్ట్ వేపు నుంచి అధికారిక ప్రకటన కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


Also Read: Chittoor: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!


తెలంగాణలో డేటా సెంటర్ పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూప్ నిర్ణయించింది.  హైదరాబాద్‌లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే దాదాపుగా రూ. 90వేల కోట్లు. అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్‌ కోసం శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ రియాల్టీతో జత కడుతున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. డేటా రంగంలో ఉన్న మరికొన్ని ప్రధానమైన కంపెనీలచూపు కూడా హైదరాబాద్ వైపు ఉన్నట్లుగా చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్.. డేటా సెంటర్.. హైదరాబాద్‌లో ఏర్పాటయితే.. తెలంగాణ ఐటీ రంగానికి మరింత ఊపు వస్తుంది.



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి