మెదక్ జిల్లాలో ఓ ట్రైనింగ్ విమానం కుప్పకూలిపోయింది. సోమవారం (డిసెంబర్ 4) ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి గ్రామ శివారులో విమానం కూలిపోయింది. ఇది దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన విమానం అని తెలుస్తోంది. పెద్ద శబ్దంతో విమానం కూలిపోవడంతో చుట్టుపక్కల స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. విమానం కూలడం వల్ల భారీ ఎత్తున్న మంటలు చెలరేగి.. పూర్తిగా కాలిపోయింది. అందులో ఓ పైలట్ సహా, మరో ట్రైనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అందులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.
ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్లు ప్యారాచ్యూట్‌తో తప్పించుకున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో పోలీసులు వారి కోసం వెతుకుతున్నారుజ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై సదరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు స్పందించాల్సి ఉంది.