APPSC Group2 Syllabus: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే గ్రూప్‌-2 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ (Gropu2 Notification) కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష (Group2 Mains) నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు.

ప్రిలిమ్స్‌ పరీక్షలో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని ఏపీపీఎస్సీ చేర్చింది. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం... 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు) నిర్వహిస్తారు. ఇందులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో ఒక్కో పేపరు 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం..

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
భారతదేశ చరిత్ర(ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) 30 30
భూగోళశాస్త్రం(జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) 30 30
భారతీయ సమాజం(స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం) 30 30
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ) 30 30
మొత్తం: 150 150

మెయిన్స్‌ పరీక్ష విధానం..

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం (నిమిషాల్లో)
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం) 150 150 150
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) 150 150 150
మొత్తం: 300 300  

గ్రూప్-2 పూర్తి సిలబస్ కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో (GMC Paderu)  ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 256 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు 11 డిసెంబరు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...