Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతుండడంతో ఇప్పటినుంచి జరిగే ప్రతీ ఎలిమినేషన్స్ చాలా కీలకంగా మారనున్నాయి. అయితే ఈవారం గౌతమ్.. ఎలిమినేట్ అవుతాడు అని సోషల్ మీడియాలో ముందు నుండే ప్రచారం మొదలయ్యింది. అనుకున్నట్టుగానే గౌతమ్.. బిగ్ బాస్ హౌజ్ వదిలి వెళ్లిపోయాడు. కానీ గౌతమ్ ఎలిమినేషన్‌కు ముందు, తర్వాత చాలా జరిగాయి. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తనకోసం ఉపయోగించాలా లేదా వేరే కంటెస్టెంట్స్ కోసం ఉపయోగించాలా అనేది ప్రశాంత్ చేతుల్లోనే ఉంటుంది. తనతో పాటు శోభా, గౌతమ్.. డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి అడిగారు నాగార్జున. అయితే ఆ పాస్ తనకు మాత్రమే కాదు ఎవరికీ ఉపయోగించనని చెప్పి షాకిచ్చాడు ప్రశాంత్. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు.


అర్జున్‌తో క్లోజ్..
గౌతమ్ ఎలిమినేట్ అయిపోయి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత హౌజ్‌మేట్స్‌లో ఎవరికి మాస్క్ ఉంది, ఎవరికి మాస్క్ లేదు అనే విషయాన్ని చెప్పమని నాగార్జున అడిగారు. అయితే మామూలుగా ఎవరిలో అయినా కొంచెం మాస్క్ ఉంటుంది అని గౌతమ్.. తెలివిగా సమాధానం ఇవ్వగా అలా కాదని, సెపరేటుగా చెప్పాలని నాగ్ అడిగారు. ముందుగా అర్జున్ గురించి చెప్తూ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కాబట్టి ఎవరితో ఎక్కువగా కలవలేకపోయాడని, తనతో మాత్రం బాగా క్లోజ్‌గా ఉండేవాడని అన్నాడు గౌతమ్. పైగా మాస్క్ లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అమర్ అయితే స్ల్పిట్ పర్సనాలిటీలాగా ఉంటాడని, అప్పుడప్పుడు మాస్క్ కనిపిస్తుందని అన్నాడు. అంతే కాకుండా ఎప్పుడూ ఫన్నీగా ఉండమని సలహా ఇచ్చాడు.


యావర్‌కు సారీ..
ప్రియాంకకు అసలు మాస్క్ లేదని చెప్తూ ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు గౌతమ్. శోభా అయితే మొదటి వారాల్లో బాగుందని, మెల్లగా ఇప్పుడు ఆట తగ్గిపోతుందని గుర్తుచేశాడు. మళ్లీ ముందులాగా ఆడమని ప్రోత్సహించాడు. లైట్‌గా తనకు కూడా మాస్క్ ఉందని తెలిపాడు. ఇక యావర్‌తో మాట్లాడుతూ జరిగిన గొడవలకు సారీ చెప్పాడు గౌతమ్. అయితే అలా మనసులో ఏమీ పెట్టుకోలేదని, పర్వాలేదని అన్నాడు యావర్. అయితే యావర్‌కు కూడా మాస్క్ లేదని తెలిపాడు గౌతమ్. ఇక పల్లవి ప్రశాంత్ గురించి చెప్పడం మొదలుపెట్టిన గౌతమ్.. శివాజీ వెనుక ఉండిపోకూడదని, తన పక్కన నడవకూడదని, తనను కొట్టి పైకి రావాలని సలహా ఇచ్చాడు. 


అది కరెక్ట్ కాదు..
ఆ తర్వాత శివాజీకి కూడా ఏదో ఒక సలహా ఇవ్వాలనుకున్నాడు గౌతమ్. కానీ తనను మాట్లాడనివ్వకుండా శివాజీనే మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘నువ్వెప్పుడూ భయపడుతూ ఉండేవాడివి. ఓదార్పు కోరుకునేవాడివి. ఎవరో ఒకరు కావాలని కోరుకునేవాడివి. అలా ఉండడం ఇక్కడే కాదు జీవితంలో కూడా కరెక్ట్ కాదు’’ అని సలహా ఇచ్చాడు. అయితే మీ సైడ్ కూడా తప్పుందేమో అప్పుడప్పుడు ఆలోచించండి అని గౌతమ్ చెప్తుండగానే.. వినకుండా ఆల్ ది బెస్ట్ అని చెప్పి కూర్చున్నాడు శివాజీ. ఇక గౌతమ్ వెళ్లిన తర్వాత.. ‘‘అసలైతే అర్జున్.. ఈవారం తక్కువ ఓట్లతో ఉన్నాడు’’ అని ఫినాలే అస్త్రా సాధించకపోయుంటే అతడే ఎలిమినేట్ అయ్యేవాడని చెప్పి షాకిచ్చారు నాగార్జున. అందుకే కంటెస్టెంట్స్ అందరినీ ఈ రెండు వారాలు జాగ్రత్తగా ఆడమని చెప్పారు.


Also Read: విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply