ప్రతి పదిమందిలో నలుగురు రాత్రిళ్లు సోషల్ మీడియా చూస్తు గడిపిస్తున్నారని వేక్‌ఫిట్ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మెట్రో సిటీలన్నింటి కంటే హైదరాబాద్ పరిస్థితి భయంకరంగా ఉందని వెల్లడైంది. ఇది 2021లో 25 శాతంగా ఉండేది. ఇప్పుడు మరింత ఎక్కువైంది.
లేట్ నైట్ నిద్రకు ప్రధాన కారణంగా డిజిటల్ గాడ్జెట్స్ అని దేశంలో 36 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
2018 నుంచి వేక్‌ఫిట్ నిర్వహించిన ఈ సర్వేలో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. 2 లక్షలపైకుపైగా ప్రజలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఏడాది 30,000 మంది తమ విలువైన సమాచారాన్ని అందించారు.
గతేడాది నుంచి చూస్తే హైదరాబాద్‌లో 32 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నట్టు తెలిపారు. 28 శాతం మంది తమ భవిష్యత్‌ను ఊహించుకొని భయపడుతూ రాత్రిళ్లు మేల్కొని ఉంటున్నారట. పనిలో నిద్ర వస్తుందని చెప్పే వారు 20 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అభిప్రాయాలు చెప్పిన వారిలో 53 శాతం మంది ఐటీ సెక్టార్‌కు చెందిన వాళ్లే.
కొన్ని సానుకూల అంశాలు కూడా సర్వేలో వెలుగులోకి వచ్చాయి. పడుకునేందుకు ముందు ఫోన్లు చూసి పడుకున్న వాళ్లు 94 శాతం ఉంటే అది ఇప్పుడు 87 శాతానికి తగ్గింది. వీరిలో 67శాతం మంది ఉదయాన్ని ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రలేచినట్టు వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 57 శాతం మంది భారతీయులు 'డూమ్‌స్క్రోలింగ్' అంటే నెగటివ్ వార్తల కోసం ఎదురు చూస్తూ రాత్రిళ్లు గడిపేస్తున్నారట. దేశవ్యాప్తంగా పని సమయంలో నిద్రపోతున్న వారి సంఖ్య బాగా తగ్గింది. కరోనా కంటే ముందు ఇది 83 శాతం ఉంటే అది ఇప్పుడు 48శాతానికి తగ్గింది.
'వేక్‌ఫిట్' గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ (GISS) 2022' పేరుతో నిర్వహించిన సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు అస్థిరమైన నిద్రతో బాధపడుతున్నారని తేలింది.