Jubilee hills Rape Case Latest Update: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక కేసులో నలుగురు మైనర్లకు హైదరాబాద్ లోని జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రెండుసార్లు వీరు బెయిల్ కోసం ఆశ్రయించగా జువైనల్ కోర్ట్ తిరస్కరించింది. తాజాగా మైనర్ నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్ కు రూ.5 వేల పుచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని షరతు విధించింది. అంతేకాక, ప్రతి నెలా హైదరాబాద్ డీపీఓ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఎమ్మెల్యే కొడుకు జువైనల్ హోంలోనే..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కొడుకు మాత్రం ఇంకా జువైనల్ హోంలోనే ఉన్నాడు. అతనికి బెయిల్ మంజూరు కానందున ఆయన ఇంకా జువైనల్ హోంలోనే ఉన్నాడు. మొదట జువెనైల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కుమారుడు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఇంకా హోంలోనే ఉన్నాడు. మరో నిందితుడుడైన సాదుద్దీన్ మాలిక్‌కు న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. దీంతో అతను చంచల్ గూడ జైలులోనే ఉన్నాడు.
విచారణలో భాగంగా నిందితుల గుర్తింపు ప్రక్రియ గత నెల జరిగింది. చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయమూర్తి సమక్షంలోనే నిందితులను గుర్తించింది. న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు బాధితురాలు వివరంగా సమాధానం ఇచ్చింది.