Hyderabad News | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, నాలాలు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేనివే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. హైడ్రాపై మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే ఎక్కువగా హైడ్రాపై ప్రచారం చేస్తుందన్నారు. సామాన్యుల ఇండ్లనే హైడ్రా కూల్చివేస్తోందని, ఒవైసీ బ్రదర్స్ కాలేజీలు, మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలను టచ్ చేయాలంటే ప్రభుత్వం, హైడ్రా భయపడుతున్నా అని మీడియా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించింది.
గ్రౌండ్ లెవల్‌లో పేపర్ వర్క్ చేస్తున్న హైడ్రా
హైడ్రా ప్రస్తుతం గ్రౌండ్ లెవల్ లో వర్క్ చేస్తోందని, సైలెంట్ గా లేదన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించారని పేర్కొన్నారు. పేద వాళ్లను ఇబ్బందులు గురిచేయడం హైడ్రా పనికాదు. హైడ్రా ఇప్పటివరకు కూల్చింది ఖాళీగా ఉన్న అక్రమ నిర్మాణాలు మాత్రమే అన్నారు. మల్లారెడ్డి కాలేజీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయి. అయితే విద్యార్థులు అకడమిక్ సంవత్సరం నష్టపోతారని ఆలోచిస్తున్నాం అన్నారు. హైడ్రా పేదల పట్ల ఒకలాగ, బడా వ్యక్తుల పట్ల మరోలా వ్యవహరించదని స్పష్టం చేశారు. అయితే అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్లే మా టార్గెట్. హైడ్రా సైలెంట్ గా ఏమి లేదు. అందుకోసం బ్యాక్ గ్రౌండ్ లో అన్ని వివరాలు పరిశీలిస్తున్నాం. న్యాయపరమైన సమస్యల గురించి ఓ అవగాహనకు వచ్చాక కూల్చివేతలు కన్ఫామ్ అని స్పష్టం చేశారు.
నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేసిన సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి గుడిసెలను మేం తొలగించలేదు. హైడ్రా వచ్చినప్పుడు కొందరు కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆందోళన చేస్తున్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందుగానే హైడ్రా సమాచారం ఇచ్చింది. కానీ కొందరు సిరియస్ తీసుకోలేదు. వారిని ఖాళీ చేపించిన తరువాతే కూల్చివేతలు మొదలుపెట్టాం. హైడ్రాను బూచిగా చూపించి బుచ్చమ్మను భయబ్రాంతులకు గురి చేశారు. మీకు చెప్పేది ఒక్కటే. హైడ్రా అంటే భరోసా. కొందరు హైడ్రాను చూపించి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. - హైడ్రా కమిషనర్ రంగనాథ్
Also Read: HYDRA Demolitions: ఆ విల్లాలకు ఎలాంటి పర్మిషన్ లేదు, అయినా భారీ నిర్మాణాలు: హైడ్రా కమిషనర్ రంగనాథ్