Professors open letter to CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ విద్యావేత్తలు కొందరు తప్పుపడుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (JNAFAU) అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సరైనది కాదని తెలంగాణ విద్యావేత్తలు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ కు లేఖ రాసిన వారిలో ఎమ్మెల్సీ కోదండరామ్‌, ప్రొఫెసర్లు హరగోపాల్‌, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహరెడ్డిలు ఉన్నారు.


ప్రభుత్వం ఇప్పటికైనా అంబేద్కర్ వర్సిటీకి చెందిన భూములను JNAFAU కు కేటాయించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన అందిస్తున్న విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ అని పేర్కొన్నారు. కనుక అలాంటి విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య కల సాకారం చేస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నష్టం కలిగించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.


Also Read: Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే