హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఓ మహిళ నగ్నంగా నిరసన తెలపడం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లోని గీతా ఆర్ట్స్‌ వద్దకు సోమవారం ఉదయం వచ్చిన ఓ మహిళా ఆర్టిస్ట్‌ నగ్నంగా ఆందోళనకు దిగింది. తనకు గీతా ఆర్ట్స్‌ నుంచి డబ్బులు రావాల్సి ఉందని, వాటిని ఇప్పించాలంటూ మహిళా ఆర్టిస్ట్‌ డిమాండ్ చేసింది. గతంలోనూ ఈ మహిళ ఫిలిం ఛాంబర్‌, బంజారాహిల్స్‌ పీఎస్‌ ఎదుట ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. అయినా తనకు డబ్బుల విషయంలో న్యాయం జరగలేదని నేరుగా గీతా ఆర్ట్స్‌ వద్దకు వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. ఆమె నగ్నంగా ఆందోళన చేస్తుండడాన్ని స్థానిక జీహెచ్ఎంసీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు బట్టలు ఇచ్చి, అక్కడి నుంచి  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.