Kamareddy Road Accident : తెలంగాణ కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి  చెందారు. ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద ట్రాలీ ఆటో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 21మందికి గాయాలయ్యాయి. ట్రాలీ ఆటోలో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రులకు తరలించారు. ఎల్లారెడ్డిలో సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 


ఐదుగురి మృతి 


ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో 21 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో డ్రైవర్‌ సాయిలుతో పాటు లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో డ్రైవర్‌ సాయిలు మృతదేహం ట్రాలీ ఆటోలోనే ఇరుక్కుపోయింది. కట్టర్లు వినియోగించి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే? 


ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ తండా రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఎల్లా రెడ్డి వారాంతపు సంతకు వెళ్లి తిరిగి ట్రాలీ ఆటో వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్స్ స్పాట్ లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. గాయాలైన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ తండా రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన 26 మంది దశదిన కర్మ సందర్బంగా ఎల్లారెడ్డి వారాంతపు సంతకు వెళ్లి ట్రాలీ ఆటో వాహనంలో తిరిగి వెళ్తుండగా పిట్లం నుంచి కామారెడ్డికి సివిల్ సప్లై బియ్యం లోడ్ తో వెళ్తోన్న లారీ ఢీ కొంది. దీంతో అక్కడికి అక్కడే ముగ్గురు మృతి చెందగా గాయాలైన 21 మందిని చికిత్స నిమిత్తం బాన్సువాడ  ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స మరో ముగ్గురు మృతి చెందారు. మరికొందరిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.