South Central Railway: సార్వత్రిక ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లు సొంతూర్లకు పయనం అవుతున్నారు. కాబట్టి, ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడుపుతోంది. ఆ రైలుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని ఖుర్దా రోడ్ మధ్య రైలు నడుస్తుందని.. ఇది విజయవాడ, రాజమండ్రి గుండా వెళ్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సరిగ్గా ఎన్నికల తేదీ మే 13కు ముందు మే 10వ తేదీన సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఈ రైలు వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.


ఈ స్టేషన్లలో స్టాప్‌లు
మే 10, 11 తేదీల్లో 07129, 07130 నెంబర్లతో సికింద్రాబాద్ - ఖుర్దా, ఖుర్దా - సికింద్రాబాద్ రైలు శుక్ర, శనివారాల్లో ఉండనుంది. ఈ రైలు సికింద్రాబాద్, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, క్రిష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతుంది. 






కొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లు


దీనితో పాటు సమ్మర్ స్పెషల్ ట్రైన్లను కూడా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే దాదాపు 20కి పైగా రైళ్లకు అదనపు కోచ్‌లను తగిలించనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటనలో తెలిపింది. దీంతో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల టికెట్లు త్వరగా కన్ఫామ్ కానున్నాయి. మే 10 నుంచి 14 వరకు ఆయా రైళ్లలో థర్డ్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, స్లీపర్‌, చైర్‌ కార్‌ అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్‌ వెల్లడించారు.