South Central Railway: హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో రోజూ ప్రయాణించేవారికి చేదు వార్త! వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం అయింది. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర రైళ్లను కాన్సిల్ చేస్తూ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొంది. అంతేకాక, మరో 15 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసినట్లుగా ప్రకటించింది.


లింగం పల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి, ఫలక్ నుమా - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్ నుమా, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య తిరిగే రైలు సర్వీస్‌లను రద్దు చేసింది. 


Also Read: Kukatpally Theft: హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!


Trains Cancellation Schedule: లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 9, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 9, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 7, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 7, సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో 1, లింగపల్లి – సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.






సికింద్రాబాద్, ఉందాన‌గ‌ర్, మేడ్చల్, బొల్లారం స్టేష‌న్ల మ‌ధ్య న‌డిచే రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ స్పెషల్ ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము స్పెషల్ రైలు, హుజూర్ సాహెబ్ నాందేడ్ – మేడ్చల్ – హుజూర్ సాహెబ్ నాందేడ్ ప్యాసింజ‌ర్ రైలు ర‌ద్దు అయింది. సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు సర్వీస్, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైల‌ను కూడా ర‌ద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు - విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


Also Read: Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్! ఇక్కడ అతి భారీ వర్షాలు, మరో 2 రోజుల్లో గుడ్‌న్యూస్: IMD