హైదరాబాద్ శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని లష్కర్‌గూడ సమీపంలోని ఒక ఫామ్ హౌజ్‌లో అర్ధరాత్రి పార్టీ జరుగుతుండగా పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేశారు. ఈ పార్టీలో దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో పోలీసులు హుక్కా తాగే పాట్‌లను కూడా గుర్తించారు. ఈ పార్టీని వనస్థలిపురానికి చెందిన ఒక మహిళ ప్రధానంగా నిర్వహించినట్లుగా సమాచారం. 


అయితే, ఈ రేవ్ పార్టీపై దాడులు చేసిన విషయాన్ని, పట్టుబడ్డ వారి వివరాలను గురించి పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల తీరుతో దీని వెనక ప్రముఖుల పాత్ర ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.