దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు గాంచిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదిక అయింది. ఓ స్టేషన్ ఎస్సై, ఏఆర్ ఎస్సై కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్ కి వేదికగా వాడేసుకున్నారు. పైగా ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాలను కూడా షూట్‌లో వాడేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ ఇద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా భావన అనే యువతి పనిచేస్తున్నారు. అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్న రావూరి కిషన్ కూడా పని చేస్తున్నారు. కొంత కాలంగా వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లికి కూడా సిద్ధం అయ్యారు. పెళ్లికి ముందు జరుపుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పోలీస్ స్టేషన్ నే వేదికగా చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది కూడా యూనిఫామ్ లోనే వీడియో షూట్ చేశారు. పైగా పోలీస్ వాహనంతో వెడ్డింగ్ షూట్ చేశారు. మూడు సింహాల బొమ్మను, యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్, బెల్ట్ బకెట్ వంటివి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగం చేసేశారు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 


అయితే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ని ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వాడుకోవడం విపరీతంగా విమర్శల పాలు అవుతోంది.