Manikonda Pub Case: మణికొండ కేవ్ పబ్ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. పబ్ లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో డీజే గౌరవ్ హోరెత్తించారు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు.


గౌరవ్ తో కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ కోసం కస్టమర్స్ చాటింగ్స్ చేశారు. డీజే గౌరవ్ కు హైదరాబాద్ లో ప్రముఖుల కాంటాక్ట్స్ పై విచారణ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీలో 26 మంది డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పబ్ ఓనర్స్ ముగ్గురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.


హైదరాబాద్‌ లోని మణికొండ సమీపంలోని ఖజాగూడలో పోలీసులు శనివారం అర్ధరాత్రి రైడ్స్ నిర్వహించారు. ది కేవ్‌ అనే పబ్‌‌లో రాయదుర్గం పోలీసులు, నార్కొటిక్‌ బ్యూరో అధికారులు సంయుక్తంగా పబ్ లో ఆకస్మిక దాడి చేశారు. అక్కడ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని గుర్తించారు. డ్రగ్స్ వినియోగంపై ముందస్తు సమాచారం రావడంతోనే పోలీసులు ఈ దాడులు చేశారు.


పబ్ లో దొరికిపోయిన సుమారు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి నమూనాలు తీసుకొని పరీక్షలు చేశారు. మొత్తానికి అందులో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలారు. దీంతో అందరిని అదుపులోకి తీసుకొని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ పబ్ లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్‌ నిర్వహకులు వినియోగదారులకు డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.