Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో ఉండే పబ్లిక్ టాయిలెట్లు వినియోదించాలనుకునే వారు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందేనని తెలిపారు. జూన్ నుంచి టాయిలెట్లు వాడే వారి నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. స్టేషన్ లో మరుగుదొడ్డికి రూ.5, మూత్ర విరస్జనకు రూ.2 వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించినందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. కానీ ఇక నుంచి డబ్బులు వసూలు చేస్తారు. దీంతో ఇప్పటికే మెట్రో ఛార్జీలు రాయితీల కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజా నిర్ణయం మరింత భారం కాబోతుంది. 


ఇప్పటికీ మెట్రో అధికారులు ఛార్జీలను పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులు మరియుు క్యూ ఆర్ కోడ్ తో ప్రయాణించే వారికి ఇప్పటి వరకు ఛార్జీలపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ రాయితీ నాన్ పీక్ అవర్స్ కు మాత్రమే పరిమితం చేయగా... అదే విధంగా సూపర్ సేవర్ ఆఫర్ కూడా ఛార్జీలను రూ.100 కి పెంచింది. ఇది గుర్తించిన సెలవు దినాల్లో కేవలం రూ.59తో అపరిమితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. గత కొంత కాలంగా హైదరాబాద్ మెట్రో అధికారులు ఆదాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించారు. మెట్రో ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు  పంపారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన మెట్రో మాల్స్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. తాజాగా టాయిలెట్ వాడితే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మెట్రీ ప్రయాణికులపై ఈ ఛార్జీ మరింత భారం కాబోతున్నాయి.