Hyderabad News: ముందు రెచ్చగొట్టారు. తర్వాత ప్రాణాలు మీదకు వచ్చేసరికి రక్షించండీ భయ్యా అంటూ ప్రాధేయపడ్డారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. స్నేహితుడు విగతజీవిగా నదిలో తేలాడు. 


హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన స్నేహితులు విహారయాత్రకు వెళ్లారు. కర్నాటలోని కమలాపూర్‌ చెడుగుప్ప ప్రాంతంలో టూర్‌కు వెళ్లిన వీళ్లు ఫుల్‌గా మద్యం తాగారు. తర్వాత కొందరు స్నేహితులు నదిలో ఈతకు దిగారు. ఇంకో స్నేహితుడు షాజీద్‌ మాత్రం మద్యం మత్తులో తూగుతూ రోడ్డపై నిల్చున్నాడు. 


షాజీద్‌ను ఇంకో ఫ్రెండ్ రెచ్చగొట్టాడు. ఈతకు వెళ్లాలని అంటూ పదే పదే అన్నాడు. అప్పటికే మద్యం తాగి ఒంటిపై స్పృహలేకుండా ఉన్నాడు షాజీద్‌. స్నేహితుడు చెబుతున్న మాటలకు మరింత భావోద్వేగానికి గురై నదిలో దూకేశాడు. 


అంతే నదిలో మునుగుతూ తేలుతున్న షాజీద్‌ పరిస్థితి తెలుసుకోలేకపోయిన ఒడ్డున్న మరో స్నేహితుడు మరింతగా రెచ్చగొట్టాడు. ఈదాలి అంటూ పక్కనే ఫ్రెండ్‌ వద్దకు వెళ్లాలని అన్నాడు. ఆ ప్రయత్నంలోనే అందరూ చూస్తుండగానే నదిలో మునిగిపోయాడు. 


ప్రమాదాన్ని గుర్తించిన స్నేహితుడు అప్పుడు మేల్కొని షాజీద్‌ను రక్షించాలంటూ వేడుకోవడం మొదలు పెట్టాడు. ఆ దారిలో వెళ్తున్న వారిని బతిమలాడి లోతుగా వెళ్లి వెతకాలని ప్రాధేయపడ్డాడు. కానీ అప్పటికే షాజీద్‌ను మృత్యువు కబలించేసింది.


విహార యాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు ముగ్గురుగా తీరిగి వచ్చారు. దీంతో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో నిండిపోయింది.