Hyderabad And Telangana Weather Update: భారీ వర్షాలతో హైదరాబాద్‌ చల్లబడింది. అర్థరాత్రి నుంచి ఏకదాటిగా వాన పడింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. జనగామ, మహబూబాబాబాద్‌, మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వరంగల్‌, హన్మకొండ, భువనగిరిలో ఈదురుగాలలతో కూడిన వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలకు బయటకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితి గమనించుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ వర్షాలు ఇవాళ రేపు రెండు రోజులు కురుస్తాయని చెబుతున్నారు. 






ఉష్ణోగ్రతల విషయానికి వస్తే... ఇంత వర్షాలు కురుస్తున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దిగి కిందికి రావడం లేదు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు ఆ పై నమోదు అయ్యే ప్రాంతాలు:- ఈ జిల్లాల్లో ఇవాళ 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్‌, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, ఖమ్మం, కొమ్రంభీమ్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, ములుగు, నల్గొండ, సూర్యపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యపేట. ఇవి మినహా మిగతా జిల్లాల్లో 36 నుచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.  



బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు నమోదు కాగా.. అతి తక్కువ ఉష్ణోగ్రత మెదక్‌లో 24.3 డిగ్రీలు రిజిష్టర్ అయ్యింది. 37 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో నమోదు అయింది.