ABP  WhatsApp

Bandi Sanjay On CM KCR : ఉద్యోగులకు జీతాలియ్యడం చేతకాని కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏదో చేస్తాడంట - బండి సంజయ్

ABP Desam Updated at: 10 Jun 2022 05:16 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Bandi Sanjay On CM KCR : బీజేపీని హేళన చేసిన పార్టీలన్నీ తెరమరుగయ్యాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

బండి సంజయ్ (ఫైల్ ఫొటో)

NEXT PREV

Bandi Sanjay On CM KCR : ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కుకట్ పల్లిలో మాట్లాడిన ఆయన... కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. పోలీసులకు, లాఠీలకు, జైళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఎనిమిదేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఎన్నో ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలయ్యిందన్నారు. బీజేపీని హేళన చేసిన అన్ని పార్టీలు తెరమరుగయ్యాయన్నారు. ఆర్టికల్ 370ను రద్దుచేసిన ఘనత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పార్టీదే అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టిన ఘనత బీజేపీదే అని బండి సంజయ్ అన్నారు.  


ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర



ముస్లిం మహిళలకు గుదిబండగా మారిన ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఘనత బీజేపీది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ప్రధాని ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల నెరవేర్చింది బీజేపీ ప్రభుత్వం. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు చేయూత అందించారు. 8 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనపై చర్చకు కేసీఆర్ సిద్ధమా?  తెలంగాణ రాష్ట్రంలో మద్యం మత్తులో అనేక అత్యాచారాలు జరుగుతున్న కేసీఆర్ పట్టించుకోవడంలేదు. తెలంగాణ రైతాంగాన్ని నమ్మించి మోసం చేసిన దొంగ కేసీఆర్. ఉద్యోగులకు జీతాలియ్యడం చేతకాని ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఏదో చేస్తానని బయలుదేరిండు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. రాముడిని అవమానించిన ఓవైసిని, హిందువులు ను ఊచకోత కోస్తానన్న ఎంఐఎం నాయకులను కేసీఆర్ కాపాడుతున్నారు. పాతబస్తీలో అభివృద్ధి జరగకుండా మురికివాడలుగా ఎందుకున్నాయి అని ఆలోచించాల్సిన అవసరం ముస్లిం పెద్దలకుంది. జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటనలో బీజేపీ ధర్నా తర్వాతనే నిందితులను అరెస్ట్ చేశారు. - - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 









Published at: 10 Jun 2022 05:02 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.