Hyderabad Floods: రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీంతో ఉస్మాన్ సాగర్ కు 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1785.85 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు. అటు హిమాయత్ సాగర్ కు 1500 క్యూసెక్కుల వరద వస్తోంది. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.50 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు. దీంతో హిమాయత్ సాగర్ 4 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లను మూసివేశారు. పోలీసులు ఇరువైపులా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 


వివిధ ప్రాజెక్టల వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...



  • గోదావరి బేసిన్‌లో ఉన్న సింగూరులో పూర్తి స్థాయి నీటి మట్టం 1717.93 అడుగులు ఉంటే ప్రస్తుతం 1709.53అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 29.91 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 19.25 టీఎంసీల నీరు ఉంది. సింగూరుకు 8,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... 385 క్యూసెక్కులను నీటిని బయటకు వదులుతున్నారు. 

  • నిజాం సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం 1388.03 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.8 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 4.39 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 23,400 క్యూసెక్కులు ఉంటే బయటకు ఇంకా నీటిని విడుదల చేయడం లేదు. 

  • శ్రీరాం సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం -1091 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 1070.90 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు - ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 38.95 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 59,165 ఉంది. ప్రస్తుతానికి నీటిని బయటకు వదలడం లేదు. 


మిడ్‌మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -1043.31 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -1025.69 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -27.50 టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.72 టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 4590 క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 1700 క్యూసెక్కులు


లోయర్ మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -920 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -896.35 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -24.07టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --8.55 టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 1522 క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో-226క్యూసెక్కులు


కడెం పూర్తిస్థాయి నీటి మట్టం -700అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -694.700 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -7.6 టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --5.66టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 16,1800క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 104334క్యూసెక్కులు 


9 గేట్లు ఎత్తి నీటి విడుదల


ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి మట్టం -485.56 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -478.94అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -20.18టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.96టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 10,226క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 7559క్యూసెక్కులు



అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం సమ్మక్క బ్యారేజీ 8.76 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మేడిగడ్డబ్యారేజీకి 5.65 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌ బ్యారేజీకి 9.57లక్షల క్యూసెక్కులుు, సుందిళ్ల బ్యారేజీకి 1296 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆయా ప్రాజెక్టుల్లో గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.