Telangana And Hyderabad Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వర్షానికి చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వనస్థలిపురం, ఎల్పీనగర్, కొత్తపేట, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కోఠీ, నాంపల్లి, పంజాగుట్ట, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్, అమీర్పేట ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫలా నిలిచిపోయింది.
హైదరాబాద్‌లో48 గంటల పాటు కుండపోత
హైదరాబాద్‌లో 48 గంటల్లో భారీ వర్షాలు ఖాయమంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. దీని కారణంగా మరోసారి మూసి వరదలు చూస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బంగాలాఖాతంలో ఏర్పడిన ద్రోణి మరింత బలపడి తీరంవైపునకు దూసుకొస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా 48 గంటల పాటు హైదరాబాద్‌ను కుండపోత వానలు కుమ్మేస్తాయని అలర్ట్ చేస్తున్నారు. ఈ వర్షాలు కారణంగా కృష్ణ, మూసి, మంజీర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని పరివాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
వర్షం కారణంగా బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు పార్కింగ్ చేసి ఉన్న కారును, ఆటోను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారు పాల్టీలు కొట్టింది. ఇందులో ఉన్న డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి.
Also Read: విజయవాడలో భారీ వర్షం- విరిగిపడ్డ కొండచరియలు- పలువురికి గాయాలు
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, నాళాల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని అంటున్నారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయియ. తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రుం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇప్పుడు బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి. దీని ప్రభావం వచ్చే నెల ఆఖరి వరకు ఉంటుందని అంటున్నారు. అక్టోబర్‌లో కూడా అల్పపీడనలు ఏర్పడబోతున్నాయని అప్పుడు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండు నెలలు కూడా వర్షాలు కురుస్తుంటాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: నేడూ కొనసాగనున్న భారీ-అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ: ఐఎండీ