తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉందని తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌ భవన్‌లో ఆమె విడుదల చేశారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు. రాజ్‌ భవన్‌ సిబ్బంది సహకారంతో తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. గవర్నర్‌గా తాను చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ మీడియా ఎంతగానో సహకరించిందని.. అందుకే ప్రజలకు మరింత చేరువ కాగలిగానని తమిళిసై అన్నారు. గవర్నర్‌గా రెండేళ్ల విజయాన్ని ఇటీవల మృతిచెందిన తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు తమిళిసై చెప్పారు.


ALSO READ: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి పేరు సిఫార్సుపై గవర్నర్ అసంతృప్తి ! ఇక ఆమోదం కష్టమే..


కరోనా వ్యాక్సినేషన్ గురించి తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తనకు సీఎం కేసీఆర్‌తో విభేదాలు ఏం లేవని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తమిళిసై తెలిపారు. మొదట్లో ఆయుష్మాన్‌ భారత్‌కు సీఎం ఆసక్తి చూపలేదని, ఆ కార్యక్రమం గురించి తాను ఆయనకు వివరించడంతో సమ్మతించారని గుర్తుచేసుకున్నారు. అతి త్వరలో దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందుతుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమవంతు సహాయంగా రోగులకు కిట్లను అందించారని అన్నారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్‌క్రాస్‌, ఇండియన్‌ ఆర్మీకి గవర్నర్ కృతజ్ఞతలు చెప్పారు.


ALSO READ:దేశంలో "ధర్డ్ ఫ్రంట్" ప్రయత్నాలు ! 25న హర్యానాలో తొలి సమావేశం ! 


గవర్నర్‌ను కలిసిన సభాపతి పోచారం, అసెంబ్లీ కార్యదర్శి
రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆమెకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రట‌రీ న‌ర‌సింహాచార్య శుభాకాంక్షలు తెలియజేశారు.


Also Read: కెల్విన్‌తో ఉన్న సంబంధాలేంటి? రానాను సుదీర్ఘంగా విచారిస్తున్న ఈడీ అధికారులు