ఖైరతాబాద్ వచ్చే భక్తులకు మేయర్ కీలక సూచనలు.. abp desam Special
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంగణాన్ని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. గణేష్ చతుర్థి సందర్భంగా రోడ్లు ఎలా ఉన్నాయో చూడటానికి వచ్చామని, ఎక్కువ పబ్లిక్ వచ్చే ఏరియా ఇది కాబట్టి గణేష్ ఉత్సవ కమిటీని అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నామని మేయర్ అన్నారు. వర్షం వల్ల గోతులు ఏర్పడ్డాయని, అవన్నీ పూడ్చమని సిబ్బందిని ఆదేశించామన్నారు.