Double Bedroom House: ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. సీసీ రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు సైతం సర్కార్ చేపట్టింది. డిగ్నిటీ ఆఫ్ హౌసింగ్ అంటూ పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా ఇళ్లను నిర్మించి, లబ్దిదారులను ఎంపిక చేసి అందిస్తోంది. తాజాగా మరికొన్ని ఇండ్లను ప్రారంభించారు.






ఇందిరానగర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 210 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదవారికి దశలవారీగా ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రులు తెలిపారు.






తెలంగాణ ప్రభుత్వం ఖైరతాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం రూ. 17.85 కోట్లతో ప్రతిష్టాత్మకంగా 210 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక, అన్ని సదుపాయాలు పరిశీలించిన మంత్రులు నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించడంతో పాటు లబ్దిదారులకు వాటిని అందజేశారు.


Also Read: World Cancer Day: వీటిని రోజూ తింటే పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం... మంచి ఆహారం, వ్యాయామమే క్యాన్సర్‌ను అడ్డుకోగలవు


Also Read: Chittoor Crime: సిగరెట్ తాగేందుకు స్నేహితుడ్ని బయటకు పిలిచి ఏం చేశారంటే..! ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా !