Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా దిగొచ్చాయి.  మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,980కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ఇటీవల రూ.200 మేర తగ్గింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,600 అయింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా విజయవాడలో 24 క్యారెట్ల బంగారంపై రూ.390 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,980 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,900కి పతనమైంది. వెండి 1 కేజీ ధర రూ.65,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,980 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.180 తగ్గడంతో తులం ధర రూ.45,140 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,240కు పతనమైంది.


ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.25,070 అయింది. తాజాగా రూ.86 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్లాటినం ధర రూ.13 మేర తగ్గగా.. అక్కడ తులం ధర రూ.24,940కి పతనమైంది. హైదరాబాద్‌లో, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో రూ.86 మేర పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,070 కు చేరింది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Horoscope Today 3 February 2022 : చెప్పుడుమాటలు విని సమయం వృధా చేసుకోకండి… ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి 


Also Read: Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్‌కు జాతీయ పతాకం రంగులు.. నేతల మధ్య సద్దుమణిగిన వివాదం