Tollywood Actress Dimple Hayathi Case: పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని టాలీవుడ్ నటి డింపుల్‌ హయతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని నటి హైకోర్టును ఆశ్రయించారు. అధికారం ఉందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడి చేయడంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్న డింపుల్ హయతి తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. డింపుల్ హయతి పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. డింపుల్ హయాతికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. 


పోలీసులు సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ నోటిసులకు అనుగుణంగా నటి డింపుల్ హయతి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న లాయర్ విక్టర్ డేవిడ్‌కు కూడా 41ఏ నోటీసు ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు సూచించింది.  సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందుకున్న వారు చట్టాన్ని అనుసరించి విచారణకు హాజరు కావాలని హైకోర్టు సూచించింది.  


జూబ్లీహిల్స్ పీఎస్ లో నటిపై కేసు నమోదు 
రాహుల్ హెగ్డే, డింపుల్ హయతి వివాదం ముదిరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో నటి డింపుల్‌ హయతి నివాసం ఉంటున్నారు. అదే అపార్టుమెంట్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే ఉంటున్నారు. డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని వారి అపార్ట్ మెంట్ సెల్లార్‌లో పార్కింగ్‌ చేయగా.. ఆ వాహనం పక్కనే నటి తన వాహనాన్ని పార్కింగ్‌ చేస్తారు. కానీ డింపుల్ తన కారు కవర్ ను తొలగిస్తోందని, కారును ఢీకొట్టిందని డీసీపీ రాహుల్ హెగ్డే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ చేతన్ కుమార్ సీసీటీవీని పోలీసులకు ఇవ్వగా వారు జూబ్లీహిల్స్ పోలీసులు నటి డింపుల్ హయతిపై కేసు నమోదు చేశారు. 
Also Read: Dimple Hayathi VS Rahul Hegde : డింపుల్ వర్సెస్ ఐపీఎస్ రాహుల్ కేసులో బల్దియాకు చిక్కులు


డింపుల్ హయతి పోస్టులు సంచలనం! 
మే 14వ తేదీన డింపుల్ హయతి తన కారుతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టగా.. తమ వాహనం ముందు భాగం దెబ్బతిన్నదని రాహుల్ హెగ్డే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశయగా నటిపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు ఏమైనా చేయవచ్చు అనుకుంటున్నారని డింపుల్ హయతి తన సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులు ఇటీవల వైరల్ గా మారాయి. అధికారంతో నిజాన్ని మార్చలేము అని మరో ట్వీట్ సైతం దుమారం రేపింది. రాహుల్ హెగ్డే మూగ జీవాల పట్ల కఠినంగా వ్యవహరించారని, వాటిని హింసకు గురి చేస్తుంటే డింపుల్ హయతి వద్దని వారించారని, అందుకని ఆమెపై తప్పుడు కేసు పెట్టారని నటి తరఫు న్యాయవాది పాల్ సత్యానందన్ పేర్కొన్నారు. 
Also Read: Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్


తాను కోన్స్ ను మాత్రమే తన్నినట్లు చెప్పిన డింపుల్.. పబ్లిక్ ప్రాపర్టీ అయిన కోన్స్ అపార్ట్ మెంట్ కు ఎలా వచ్చాయి, ఎవరి నుంచి తెప్పించుకున్నారో అధికారులు తెలుసుకున్నారా అని సైతం పలు విషయాలను ఆమె ప్రస్తావించింది.