జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను గుర్తించగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అయితే నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్ ఆరోపించారు. డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్ లో తాజాగా ఒక పబ్ నుండి టీఆర్ఆర్, ఎంఐఎం పార్టీ చెందిన పెద్దల పిల్లలు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన అరాచక చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖడించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందుతులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. 


ఉక్కుపాదం మోపాలంటే ప్రభుత్వం పట్టించుకోలేదు
డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపాలని గతంలో ఎన్ని సార్లు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు కోరినా టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోలేదని దాసోసు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పుడు అధికార పార్టీ చెందిన వారి పిల్లలే ఇలాంటి దాస్టికానికి పాల్పడటం దుర్మార్గం అన్నారు. మే 28 తేదిన అత్యాచారం జరిగినట్లు ఎఫ్ ఐఆర్ లో వుంది, అయితే మే 31 తేదిన తండ్రి ఫిర్యాదు చేసినట్లుగా ఉంది. జూన్ 3 తేదీ వచ్చినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోలీసులు ఏం చేస్తున్నారు ? ఎవరిని విచారించారు.. నిందుతులు ఎవరు ? అనే అంశాలు ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 






సీసీటీవీ ఫుటేజీలో అంతా కనిపిస్తోంది
మైనర్ బాలికను కొందరు తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ పుటేజ్ లో కనిపిస్తున్నాయి. పబ్‌లో కూడా ఫుటేజ్ వుంటుంది. దాని ప్రకారం నిందుతులను ఎవరైనా పట్టుకోవచ్చు అన్నారు. ఎఫ్ఐర్‌లో కారు నెంబర్ ఇచ్చారు కానీ వెహికల్ ఓనర్ పేరు ఇవ్వకపోవడంలోనే ప్రభుత్వ కుట్ర కనిపిస్తుందని ఆరోపించారు. కారు నెంబర్ వుంటే ఓనర్ పేరు తెలుసుకోవడం చాలా సులువు అని, ఆన్ లైన్ లో నెంబర్ కొడితే పేరు వస్తుందన్నారు. అయితే కారు ఓనర్ పేరు చెప్పడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు ? ఎవరిని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారని దాసోసు శ్రవణ్ ప్రశ్నించారు. ఇలా అయితే మహిళలకి పోలీసులు, ప్రభుత్వం ఎలా రక్షణ కలిపిస్తుందో చెప్పాలన్నారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఆడపిల్లలకు రక్షణ కలిపించే విధంగా వెంటనే నిందితులకు  కఠిన శిక్షలు వేయాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


Also Read: Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడికి సంబంధం లేదు - డీసీపీ జోయల్ డేవిస్ 


Also Read: Jubilee Hills Police Station : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, బాలికపై అత్యాచారం కేసును నీరుగారుస్తున్నారని బీజేపీ ఆందోళన