ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం వెంట టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, మంత్రులు కూడా వెళ్లనున్నారు. రెండు మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్ వర్గాలు ప్రకటించాయి. జాతీయ రాజకీయాల సన్నాహాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక, ఈ పర్యటనలో భాగంగా నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటు, నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రాజెక్ట్ తో పాటు, ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ నెల 18నే ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ, వాతావరణం సహకరించకపోవడం, రాష్ట్రపతి ఎన్నికల వల్ల సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లలేదు. దీంతో నేడు ఈ ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో కేసీఆర్ మాట్లాడనున్నారు.