కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఉదయం 7 గంటలకు మొదలైన కార్యక్రమాలు సాయంత్ర వరకు కొనసాగనున్నాయి. ఉదయం 7 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట వద్దకు చేరుకొని 7.10కి జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. సాయంత్రం 5.30 గంటలకు కిషన్ రెడ్డి మళ్లీ గోల్కొండ కోటకు చేరుకుంటారు. 6:05 గంటలకు ప్రసంగిస్తారు. అనంతరం ఓ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఆరున్నరకు వచ్చిన అతిథులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ముగింపు ప్రసంగం ఉంటుంది. తర్వాత 9 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి. సింగర్ మంగ్లీ, మధుప్రియ పాటలు పాడనున్నారు. సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో దేశభక్తి పాటల కార్యక్రమం కూడా ఉంది.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందన్నారు. దీన్ని ఒకరిద్దరి వల్లే వచ్చిందనే మాటలు కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ పోరాటం ఫలితంగానే ఆ నాడు కేంద్రంలో ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. దీనికి బీజేపీ పూర్తిగా సహకరించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్‌తో పోరాడారని తెలిపారు కిషన్ రెడ్డి. పోరాటాలు త్యాగలతో తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు కిషన్ రెడ్డి. వాటి కోసం మరోసారి పోరాటం చేయాల్సి ఉందన్నారు.