Car Accident At Balakrishna's House: టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని (Hyderabad) జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-1లో వేగంగా వచ్చిన కారు.. బాలయ్య ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. అయితే, డ్రైవర్ అతివేగంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: అఫీషియల్‌గా వీరమల్లు వాయిదా... మేకి వెళ్లిన పవన్ - నితిన్, నాగవంశీ సినిమాలకు లైన్ క్లియర్