Bandi Ramesh About Bhavani Kedia : క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని  బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన ఇండోర్ డెఫ్ టెన్నిస్ లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి తెలంగాణ క్రీడాకారిణి భవాని కేడియాకు సికింద్రాబాద్ లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బండి రమేష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. భవాని తల్లిదండ్రులను, కోచ్ ను అభినందించారు. టెన్నిస్ క్రీడకు ఉన్న అభిమానులు ప్రపంచంలో ఏ క్రీడకు కూడా లేరని తెలపడంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. అటువంటి క్రీడల్లో బంగారు పథకం సాధించడం తెలంగాణకే గర్వకారణం అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుండి కావల్సినంత సహకారం అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




"భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ క్రీడలను ఎంకరేజ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తా ఉంది. టెన్నిస్ క్రీడాకారిణినే మన రాష్ట్ర అంబాసిడర్ గా పెట్టుకోవడం జరిగింది. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి రాబోయే రోజుల్లో భవాని అభివృద్ధికి ఇంకా ఎంకరేజ్ మెంట్ అందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో ఆమెను మరింత ముందుగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేయడానికి చాలా గర్వంగా ఉంది. అందులోనూ ఎవరైనా రాష్ట్రానికి మేడ్చల్ తీసుకొచ్చినప్పుడు సత్కరించుకోవడంలో తెలంగాణ ముందుంది. కాబట్టి రాబోయే రోజుల్లో క్రీడల్లో తెలంగాణ ముందుండేలా ప్రోత్సహించేందుకు మనం మరింతగా కృషి చేద్దాం." - బండి రమేష్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి


భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ అరుదైన ఘనత 
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు అందుకున్నారు. టీ20 ఫార్మాట్ లో ప్రపంచంలోనే 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రీడాకారిణిగా హర్మన్ ఘనత సాధించారు.  మహిళల టీ20 ప్రపంచకప్ లో నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ కౌర్ కు 150వ టీ20 మ్యాచ్. అలాగే పొట్టి ఫార్మాట్ లో 3వేల పరుగులు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచారు. సుజీ బేట్స్, మెగ్ లానింగ్, స్టెఫానీ టేలర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మహిళా ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తింపు పొందారు. 


మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 5 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిరాశపరిచింది. ఆమె 20 బంతులాడి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ హర్మన్ కు 150వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.