BJP MLA Raja Singh challenges CM Revanth Reddy to demolish Fatima Owaisi College | హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు పర్వం ప్రతిరోజూ పెను సంచలనంగా మారుతోంది. చెరువులు ఆక్రమించింది ధనవంతులైనా, పేదవాళ్లైనా ఎవరినీ వదిలేది లేదంటూ హైడ్రా బుల్డోజర్ దూసుకుపోతోంది. తాజాగా బోరబండలోని సున్నపు చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీప్ల్ 4 భవననంతోపాటు రేకుల షెడ్లను కూల్చేశారు. బాధితుల ఆందోళనతో హైడ్రా కూల్చివేతలు వివాదంగా మారాయి.
హైడ్రా కూల్చివేతలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యేే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పెను సవాలుగా మారాయి. సలకం చెరువును ఆక్రమించి ఫాతిమా ఒవైపి కాలేజీ నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఫాతిమా కాలేజీకి హైడ్రా నోటీసులు జారీచేసింది. అయితే నేటికీ కాలేజి కూల్చివేత ప్రక్రియ జరగలేదు. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. నోటీసులు ఇచ్చి కూడా ఒవైసీల కాలేజీపై ఎందుకు ఆగుతున్నారు. ఒవైసి బ్రదర్స్ కు సిఎం రేవంత్ రెడ్డి భయపడ్డారా? లేక రాజీపడ్డారా ? అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు హైడ్రా అధికారులు బోరబండ లోని సున్నపు చెరువు ప్రక్కనే ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్, సిఎం రేవంత్ రెడ్డికి గతంలో కూడా మేము చెప్పాము.మళ్లీ మరోసారి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే ఒవైసికి చెందిన ఫాతిమా కాలేజికి నోటీసులు పంపించారు. ఇంకా ఎందుకు ఆగుతున్నారు. జనాలు అంటున్నారు ఇది హైడ్రా కాదని, హైడ్రా పేరుతో హైడ్రాామా నడుస్తోందని రాజాసింగ్ ఆరోపించారు.
పేదవాళ్ల ఇళ్లను కూలేస్తున్న హైడ్రాకు ఫాతిమా కాలేజి ఆక్రమణ ఎందుకు కనిపించడంలేదు. ముఖ్యమంత్రికి ,ఓవైసికి రాజీ కుదిరిందా..లేక అక్భరుద్దీన్ వార్నింగ్ ఇస్తే సిఎం రేవంత్ రెడ్డి భయపడ్డారా అనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఓవైసి విషయంలో హైడ్రా తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జనాల్లో చర్చనడుస్తో్ంది. ఎందుకు వదిలేస్తున్నారు.ఆక్రమ నిర్మాణం అని తెలిసి నోటీసులు ఇచ్చికూడా కూల్చేయకుంటే ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారు.ఇప్పటికైనా ఓవైసి కాలేజిని కూల్చేసి హైడ్రాపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు.
‘తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చెరువుల భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలకు హైడ్రా ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా కమిషనర్ గా ఏవీ రంగనాథ్ ను నియమించారు. కానీ ఎప్పటి వరకూ మీరు ఫాతిమా ఒవైసి కాలేజిని కూల్చివేయరో అప్పటి వరకూ హైడ్రాపై జనాల్లో నమ్మకం కురదదు. ఎప్పుడైతే ఫాతిమా కాలేజిని కూల్చివేస్తారో అప్పుడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హీరో అవుతారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. వారు ఒవైసి బ్రదర్స్ కు కొమ్ముకాశారు. ఒవైసికి గత ముఖ్యమంత్రులు కొందరు బయపడి పనిచేశారు. అదే అవకాశంగా తీసుకుని ఎంఐఎం నేతలు అనేక చెరువులు, ప్రభుత్వ స్దలాలు కబ్జా చేశారు. వీళ్ల ఎమ్యెల్యేలతో ఓ టీమ్ తయారు చేసి భూములు కబ్జాలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒవైసి కాలేజి కూల్చేస్తారో ఆ తేది చెప్పాలని’ బీజేపీ నేత రాజా సింగ్ డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఫాతిమా కాలేజి ఎప్పుడు కూల్చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఆస్తులను హైడ్రా టచ్ చేయలేదని సైతం కామెంట్లు చేస్తున్నారు. ఒవైసీ బ్రదర్స్ ను టచ్ చేయరని, రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రభుత్వాలు వారికి మద్దతుగా ఉంటాయన్న వాదన వినిపిస్తోంది.