Bandi Sanjay Tweet: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన తమిళిసైకి ప్రజా ప్రతినిధులు గౌరవించట్లేదని అన్నారు. అలాగే ఆమెను బీజీపీ వ్యక్తిగా ముద్రవేసి అవమానిస్తున్నారంటూ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు మహిళలను గౌరవించడం లేదు, బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా పాటించట్లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబమే ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని సృష్టించుకుందని.. వాళ్లు అది మాత్రమే ఫాలో అవుతున్నారని తెలిపారు. అలాంటి నాయకుల దగ్గర నుంచి అంతకంటే ఇంకా ఏం ఆశించగలమని అన్నారు. 






రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని, టీఆర్ఎస్ అధికార ప్రతినిధులు ప్రొటోకాల్ పాటించాలని అలాగే రాజ్ భవన్ కు గౌవరం ఇవ్వాలని... గవర్నర్ తమిళిసై కోరుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. 


అసలేం జరిగిందంటే..?


రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ గా ఆమె బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా రాజ్ భవన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం దగ్గర నుంచి ఈ మధ్య బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటన వరకు అన్ని అంశాల్లోనూ తన అభిప్రాయాలను ఎవరికీ భయపడకుండా వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను డైరెక్ట్ ఎటాక్ చేశారు. ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని సీఎం ఎందుకు రాలేదో చెప్పాలేదన్నారు. రాజ్ భవన్ ఏమన్నా అంటరాని స్థలమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానని చెప్పారు. 


రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారిందని పేర్కొన్న గవర్నర్ తమిళిసై.. రాజ్ భవన్ పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే గవర్నర్ తమిళిసై చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ నేతలు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు కీలక నేతలు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గవర్నర్ పదివిలో ఉండి... బీజేపీ నేతలా మాట్లాడడం మానేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ పరువు తీసేందుకు రాజ్ భవన్ ను వేదికగా మార్చారంటూ మండిపడ్డారు. వీరికి కౌంటర్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు.