Pregnant Wife Murder Case | మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో స్వాతీ హత్యకేసు విచాణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపిన మహేందర్ రెడ్డి, శరీర భాగాలను మూసిలో పడవేసిన తీరు, ప్లాన్ అమలు చేసిన విధానం తాజాగా పోలీసు కష్టడిలో ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. హత్య చేసిన తరువాత శరీర భాగాలను కట్ చేసేందుకు హేక్సా బ్లేడ్ ను ముందుగానే కొని తెచ్చిపెట్టుకున్నట్లుగా పోలీసులకు విచారించాడు నిందితుడు. చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లను ముందుగానే తెచ్చి దాచిపెట్టుకున్నాడు.


హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి..


భార్య స్వాతిని అత్యంత కిరాతంకంగా చంపిన తరువాత శరీర భాగాలను హాక్సా బ్లేడ్ తో కట్ చేసి, బ్లాక్ కవర్ లలో కాళ్లు, చేతులు ,తల ఇలా  విడివిడిగా మూడు కవర్లలో ప్యాక్ చేశాడు. ఇంటిమీద ఉన్న ఇటుకలను తెచ్చి తలకు తాడుతో కట్టాడు. నీటిలో పడివేసిన తరువాత తల పైకి తేలే అవకాశాలు లేకుండా స్వాతీ తలను బలమైన రాళ్లతో కట్టి , బ్లాక్ కవర్ లో వేసుకున్నాడు. తల ఉన్న కవర్ ను బ్యాగ్ లో వేసుకున్నాడు. చేతులున్న కవర్ బస్తాలో వేసుకుని బైక్ పైన ముందు భాగంలో పెట్టుకున్నాడు. బోడుప్పల్ నుండి ప్రతాప సింగారం వరకూ బైక్ పై కవర్లను తీసుకెళ్లి , అక్కడ మూసీనదిలొో ఒక్కొక్కటిగా చేతులు పెట్టిన బస్తాను, రాయికట్టిన తల ఉన్న బ్యాగ్ ను ఒక్కొక్కటిగా మూసీలోకి విసిరివేశాడు. 


శరీర భాగాలకు రాళ్లు కట్టి మూసీలో పడవేస్తున్న నిందితుడు 


మూసీలో తల ,చేతులు పడవేసిన తరువాత తిరిగి వచ్చే దారిలో 10కిలోల బరువున్న రాయిని బైక్ పై పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు మహేందర్ రెడ్డి. స్వాతి శరీరం నుండి వేరుచేసిన రెండు కాళ్లను , తనతొో తెచ్చుకున్న 10కిలోల రాయికి కట్టాడు. అలా యూరియా బస్తాలో కాళ్లను మూటకట్టి తీసుకెళ్లి మూసీలో పడేశాడు. శరీర భాగాలు మూసిలో వేసిన తరువాత స్వాతి ఫోన్ తీసుకుని,  తన చెల్లికి మెసేజ్ చేశాడు. తిన్నారా అంటూ స్వాతీ ఫోన్ నుండి తన చెల్లి ఫోన్ కు మెసేజ్ చేసి, ఆ మెసేజ్ స్వాతీ చేసినట్లుగా నమ్మించాడు. మూసీ నుండి వచ్చే దారిలో మేడిపల్లిలోని ఓ  పాన్ షాపు వద్ద ఆగి, సిగిరెట్ త్రాగుతూ , స్వాతి చెల్లికి ఫోన్ చేశాడు. మీ అక్క ఇంట్లో గొడవపది వెళ్లిపోయిందని చెప్పాడు. పోలీస్టేషన్ లో కంప్లెంట్ ఇస్తున్నానంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు మహేందర్ రెడ్డి.


తన బావ గోవర్దన్ రెడ్డితో కలసి మేడిపల్లి  పోలీస్టేషన్ కు వెళ్తిన మహేందర్ రెడ్డి,  నా భార్య కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసే క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తనబడుతూ సమాధానం ఇవ్వడంతో దొరికిపోయాాడు. తానే తన భార్య స్వాతి హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. చంపిన తరువాత శరీర భాగాలు ముక్కలుగా చేసి ,బ్లాక్ కవర్ లో తీసుకెళ్లి మూసిలో పడేశానని చెప్పాడు. మహేందర్ రెడ్డి మాటలు విన్న పోలీసులు తమతో రమ్మని,  భార్య శరీర భాగాలు మూసిలో ఎక్కడ పడేశావో చూపించాలని అడిగారు. తనకు బాగా నిద్రొస్తోందని, ఇప్పుడు రాలేనంటూ చెబుతూ ,స్టేషన్ లోనే నిద్రపోయాడు మహేందర్ రెడ్డి. ఇలా అత్యంత క్రూరంగా భార్యను హత్యచేసిన తీరు తాాజాగా సీన్ టూ సీన్ పోలీసులకు వివరించాడు. ఇదిలా ఉంటే మూసీలో ఏకంగా పదికిలోమీటర్ల మేర స్వాతీ శరీర భాగాల కోసం పోలీసులు ఎంత వెతికినా నేటికీ దొరకలేదు. తమ బిడ్డ శరీర భాాగాలు ఇస్తేనే తాము వెళతామంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.