Student Fire : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యార్థి ఒకరు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడమే కాకుండా ప్రిన్సిపాల్‌కు కూడా అంటించిన ఘటన చోటు చేసుకుంది. ఆ విద్యార్థి ఇలా ఎందుకు  చేశారో  పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. అంబర్‌పేటలో ఉన్న ప్రముఖ గ్రూప్‌నకు చెందిన కాలేజీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులు పలు రకాల విద్యార్థి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉన్న ప్రశాంత్ గౌడ్ అనే విద్యార్థి ఈ ఉదయం ప్రిన్సిపాల్ రూమ్‌కు వెళ్లారు. ఏ విషయం మాట్లాడటానికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ కాసేపటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. ప్రిన్సిపాల్‌కు కూడా అంటించే ప్రయత్నం చేశారు. 


ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతూ  పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి 


విద్యార్థి ప్రశాంత్ గౌడ్ ఒక్క సారిగా ఇలా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ ఒక్క సారిగా ఆందోళకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లను పిలిపించారు. విద్యార్థితో పాటు ప్రిన్సిపాల్‌కు కూడా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి  ఇద్దర్నీ తరలించారు. ఇద్దరిలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే  కాలిన గాయాలు కావడంతో  వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 


లవర్ ను గర్భవతి చేసిన యువకుడు, అబార్షన్ వికటించి యువతి మృతి


ప్రిన్సిపాల్‌నూ పట్టుకోవడంతో ఆయనకూ గాయాలు


విద్యార్థి ప్రశాంత్ గౌడ్ ఇలా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో పాటు ప్రిన్సిపాల్ కు కూడా అంటించడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ప్రశాంత్ ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏమిటన్నదానిపై విచారణ జరుపుతున్నారు. విద్యార్థితో  ప్రిన్సిపాల్‌కు ఎలాంటి వివాదం ఏర్పడిందో ఇతర విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటన కారణంగా ఆ ప్రైవేటు కాలేజీలో క్లాసులు నిలిపివేశారు. 


న్యూడ్ వీడియోలతో వివాహితకు వేధింపులు - రంగంలోకి దిగిన దిశా పోలీసులు, ఇద్దరు వ్యక్తులు అరెస్టు


ఫీజుల కోసం వేధించడమే కారణమా ? 


ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అనేక రకాల వివాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూండటం వల్ల వారు ఆత్మహత్య లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు విద్యార్థి తాను ఆత్మహత్య చేసుకోడవమే కాకుండా ప్రిన్సిపాల్‌కు కూడా అంటించడంతో తీవ్రమైన అంశమే అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఫీజులు కట్టాలని కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నారని   రోజూ దీనిపై కాలేజీలో అవమానాలు జరుగుతున్నాయని.. అందుకే ఇలాంటి పని చేశారని కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు.  ఈ అంశంపై విద్యా శాఖ అధికారులు కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  వారు కూడా విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.