Govt Holiday : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రేపు సెలవుగా పరగణిస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 16,17,18 మూడురోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు. ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18 మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.  




రేపు పబ్లిక్ గార్డెన్ లో వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు 


తెలంగాణ జాతీయ స‌మైక్యత దినోత్సవం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ రేపు ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. అనంత‌రం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ముఖ్యమంత్రి ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించ‌నున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ర్యాలీలు, జెండా ప్రదర్శనలు చేపట్టారు. వజ్రోత్సవాల వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 


 హైదరాబాద్ కు అమిత్ షా 


రేపు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది. రేపు పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల వేడుకలను అధికారిక నిర్వహిస్తోంది. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో కాంగ్రెస్‌ వేడుకలను నిర్వహిస్తుంది. పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏర్పాటుచేశారు.


సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 16వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీకి వెళ్తారు. అమిత్ షా రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 17 వ తేదీన ఉదయం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. 8.45 గంటల నుండి 11.45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర విమోనచ దిన వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు.


Also Read : Amit Shah Hyderabad Tour: హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు, మరోసారి TRS వర్సెస్ BJP తప్పదా !


Also Read : Minister KTR : తెలంగాణకు పోరాటాలు కొత్తేమీ కాదు, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు- మంత్రి కేటీఆర్