SVS Hospitals BIGITUP : హైదరాబాద్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో బిగిటప్ సేవలను ఎస్వీఎస్ సంస్థల  మేనేజింగ్ డైరెక్టర్ డా.కేజే రెడ్డి, డైరెక్టర్ కె.రామ్ రెడ్డి, లీడ్ జెన్ గ్రూప్ సీఈవో దుంగ హరికృష్ణ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.  హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, వికారాబాద్ లోని ఎస్వీఎస్ ఆసుపత్రుల్లో బిగిటప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డా.కేజే రెడ్డి కోరారు. ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 1998లో 850 పడకల ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని నిర్మించామన్నారు. ఎస్వీఎస్ సంస్థ అతి పెద్ద హెల్త్ కేర్ నెట్ వర్క్ కలిగిన బిగిటప్(BIGITUP) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. 



 ప్రతి ఓపీపై 10 నుంచి 30 శాతం రాయితీ 


కేవలం రూ.199లతో బిగిటప్ అనేక రకాల సేవలు అందిస్తుందని డా.కేజీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఒక ఏడాదిలో ఒక OP(Out Patient) సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. ప్రతి ఓపీపై 10 నుంచి 30 శాతం వరకు రాయితీ పొందవచ్చన్నారు. రూ.5000 పైన బిల్లుపై రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అన్ని రకాల మందులు కూడా డోర్ డెలివరీ చేస్తారని చెప్పారు. అన్ని సమయాల్లో ఉచిత వైద్య సలహాలు కోసం కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అందరికీ అన్ని వేళల్లో వైద్యం అందుబాటులో ఉండే విధంగా బిగిటప్ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బిగిటప్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఎస్వీఎస్ ఆసుపత్రికి మరో మైలురాయి అని డా.కేజే రెడ్డి తెలిపారు. బిగిటప్ అనేది ప్రజల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందని, ఎల్లప్పుడూ సర్వీసులు ఎస్వీఎస్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు. ఎస్వీఎస్ సంస్థలతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని బిగిటప్ సీఈవో దుంగ హరికృష్ణ ప్రసాద్ అన్నారు. క్యూ లైన్ లో వెయిల్ చెయ్యకుండా డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు బిగిటప్ సర్వీసెస్ పనిచేస్తుందని, వీటితో పాటు అనేక సేవలు బిగిటప్ అందిస్తుందని చెప్పారు.