Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఎడమకాలి మడమ చీలమండలంలో క్రాక్ వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. వైద్యులు సూచన మేరకు మూడు వారాల విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. విశ్రాంతి సమయంలో మంచి OTT షోలు ఏమున్నాయో సూచించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ బర్త్ డేకి ఒకరోజు ముందే గాయపడడంతో అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు కూడా సందేశం పంపించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు జరగడం సమంజసం కాదని ఆయన బావించారు. తన నిర్ణయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు.
భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు జూలై 24వ తేదీ ఆదివారం. ఇందు కోసం పార్టీ నేతలు భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అయితే వరదల కారణంగా ఈ ఈ సారి సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వాటిని కొనసాగిస్తారు. అలాగే వరద బాధిత ప్రాంతాల్లో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్యాడర్ బాధితులకు సహాయ చర్యలు చేపట్టనుంది.
ప్రతీ ఏడాది కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నేతలు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద.. అంబులెన్స్‌లు.. వికలాంగులకు ట్రై స్కూటర్లు వంటివి పంపిణీ చేసేవారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంపీ రంజిత్ రెడ్డి కేటీఆర్‌కు ప్రత్యేక వీడియోతో ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు