Krishna News : భార్యపై కత్తితో దాడి చేసి పరారీలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం భార్యపై దాడి చేశాడు. పుల్లయ్య తన రెండో భార్య రమ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమ్య స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్యపై దాడి అనంతరం పుల్లయ్య  పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న పుల్లయ్య శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. 


మామిడి తోటలో ఆత్మహత్య 


స్థానికంగా ఉన్న మామిడి తోటలో పుల్లయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పుల్లయ్య తన మొదటి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 


యువకుడి హత్య


తిరుపతి సమీపంలోని మంగళం బిటిఆర్ కాలనీకి చేందిన కన్నయ్య అదే ప్రాంతానికి చేందిన ఓ యువతిని ప్రేమించాడు.. అమ్మాయి ఇంట్లో విషయం తెలుసుకున్న పెద్దలు అమ్మాయిని మందలించి, తమ కుమార్తె జోలికి రావద్దని కన్నయ్యకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే ఎలాగైన తాను‌ ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకోవాలని భావించిన కన్నయ్య యువతిని ఈ నెల 15 తారీఖున పెళ్ళి చేసుకునేందుకు తీసుకెళ్ళాడు. అయితే  ప్రేమికులను పట్టుకున్న పూతలపట్టు పోలీసులు గుర్తించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురు తల్లిదండ్రులకు పిలిచి పంపారు. ఆ ఎపిసోడ్ అంతటితో ముగిసింది. 


శుక్రవారం రాత్రి  రాత్రి కన్నయ్య తన స్నేహితులైన చందు,ప్రవీణ్ లతో కలిసి తిరుమలనగర్ కు వెళ్ళే మార్గంలో ఉన్న చికెన్ దుకాణం వద్దకు వచ్చారు.  అదే సమయానికి అక్కడకు  యువతి‌ బావ కిరణ్, అతని స్నేహితులు గిరి,మహేష్, లక్ష్మీ నారాయణ రాజులు వచ్చారు.  మళ్లీ యువతిని తీసుకెళ్లడానికి వచ్చారేమో అనుకున్న వారు కన్నయ్యతో గొడవ పడ్డారు. గ్యాంగ్ వార్‌లాగా కొట్టుకునే ప్రయత్నంలో తమకు అందుబాటులో ఉన్న ఎగ్ ట్రేలతో దాడి చేసుకున్నారు. అప్పటి వరకూ మనకెందుకుకే అని ఓపిక పట్టి చూస్తున్న చికెన్ షాప్ యజమాని సతీష్.. పక్కకెళ్లి కొట్టుకోండని అరిచాడు. అలా అన్నందుకు యువతి తరపు బంధువుల్లో ఒకరైన లక్ష్మినారాయణ రాజు   చికెన్ కొట్టే కత్తితో యజమానిపై దాడి చేసేందుకు  ప్రయత్నించాడు. దీంతో చికెన్ కొట్టు యజమాని తన ప్రాణం కాపాడుకునందుకు  లక్ష్మీ నారాయణ రాజు చేతిలోని కత్తిన తీసుకుని లక్ష్మీ నారాయణ రాజు మెడపై నరికాడు. లక్ష్మినారాయణ రాజు స్పాట్‌లోనే చనిపోయాడు.  స్ధానికుల సమాచారం మేరకు ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ ను అదుపులోకి తీసుకుని, గొడవ పడిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.