బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని వాటిని ఎగవేశారనే ఆరోపణలపై ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అయిన కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్టయ్యారు. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకుకు రుణం ఎగవేసిన కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రూ.780 కోట్ల రుణాలను ఎగవేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వివిధ బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. 


కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు తీసుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్‌ బ్యాంకులో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్ల చొప్పున రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు పోలీసులు ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు.


జూన్‌లోనే కేసులు
ఈ ఏడాది జూన్‌లోనే కార్వీ సంస్థపై సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)లో రెండు కేసులు నమోదయ్యాయి. తమ వద్ద ఉన్న షేర్లను తనఖా పెట్టి లోన్లు తీసుకుని తర్వాత అసలు, వడ్డీ చెల్లించకుండా మోసం చేశారని.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. తమ బ్యాంకులో షేర్లపై రుణం తీసుకుని రూ.329.16 కోట్లు తిరిగి చెల్లించలేదంటూ హెచ్‌డీఎఫ్‌సీ ఫిర్యాదు చేసింది. 


ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో రుణం తీసుకుని రూ.137 కోట్లు ఎగవేశారని ఆ బ్యాంకు వేరుగా ఫిర్యాదు చేసింది. తమ వద్ద రూ.వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని, వీటిని తనఖా ఉంచుకుని రుణం ఇవ్వాలంటూ రెండేళ్ల క్రితం సంప్రదించారని ఆయన ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా రూ.185 కోట్ల రుణం మంజూరు చేశామని, కొద్దినెలలు వాయిదాలు చెల్లించిన అనంతరం ఇక చెల్లించడం మానేశారని తెలిపారు. కార్వీ సంస్థ షేర్ల లావాదేవీలపై సెబీ నిషేధం విధించిన సమయానికి వారు రూ.137 కోట్ల మేర బకాయిపడ్డారని వివరించారు. వీటిని చెల్లించాలని కోరగా ఆయన నుంచి స్పందన లేదని పోలీసులకు తెలిపారు.


Also Read: Gandhi Hospital Gang Rape: గాంధీ హాస్పిటల్ రేప్‌ కేసు మిస్టరీలో ట్విస్టు.. ఆ మహిళ ఆచూకీ గుర్తించారు కానీ..


Also Read: Santosh Nagar Gang Rape: ఆ గ్యాంగ్ రేప్ ఉత్తిదే.. తేల్చేసిన పోలీసులు, ఆ యువతి మాస్టర్ ప్లాన్ ఎందుకంటే..


Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్