అక్కడ లిఫ్ట్.. ఎక్కితే.. డబ్బులు కట్టాలి. అదేంటి అనుకోకండి.. అక్కడ రూల్ అలా పెట్టారు మరీ. ఎక్కడో కాదు అది హైదరాబాద్ లోనే. హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్ ఉపయోగించే.. పనిమనిషి, డెలివరీ బాయ్స్ కి రూ.300 జరిమానా విధిస్తామని బోర్డు పెట్టారు. ఈ విషయం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


హైదరాబాద్‌లోని హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్‌లను ఉపయోగించవద్దని.. లేకుంటే రూ.300 జరిమానా విధిస్తామని నోటీసు అంటించి ఉంది. పని మనుషులు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కితే.. జరిమానా ఉంటుందని.. నోటీసు పెట్టడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.













భారత్ లో వివక్ష కొత్తేమీ కాదు. అయితే మరో కొత్త రకం వివక్ష కనపడటంతో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. దురదృష్టవశాత్తూ.. ఇంటి పనులు, డెలివరీ బాయ్స్.. వివక్షకు గురవుతున్న ఉదాహరణాలు ఉన్నాయి. అయితే లిఫ్ట్ విషయంలోనూ వారిపై వివక్ష చూపించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ట్విట్టర్ లో ఓ జర్నలిస్టు దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 2707 కేసులు, ఇద్దరు మృతి... 5 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ


Also Read: Ask Your KTR: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేటీఆర్ కామెంట్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చేయాలని కోరిన నెటిజన్